సాహో ఓవర్సీస్ డీల్ క్లోజ్

Saaho Prabhas
Saaho Prabhas

బాహుబలి తెచ్చినా మాచో ఇమేజ్ కి తగ్గకుండా ప్రభాస్ తన తరువాతి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు.అయితే బాలీవుడ్ లో బలమయిన ఇంప్రెషన్ వేయాలంటే అక్కడ మాస్ లో ఫాలోయింగ్ పెంచుకోవాలి అని గమనించిన ప్రభాస్ అందుకుతగ్గట్టుగానే సాహో ని ఎంచుకున్నాడు.ఏకంగా 250 కోట్ల టెంటేటివ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో ఇంకా షూటింగ్ లో ఉండగానే,టీజర్ కూడా రిలీజ్ చెయ్యకుండానే మేకింగ్ వీడియోస్ తోనే బిజినెస్ మొత్తం పూర్తిచేసుకుంటుంది.


ఫస్ట్ మేకింగ్ వీడియో తో తరువాత బాలీవుడ్ టోటల్ రైట్స్ అండ్ మిగిలిన భాషల్లో ప్రెజెంటేషన్ రైట్స్ వరకు దాదాపు 200 కోట్ల మేర డీల్ జరిగింది.ఇక ఇప్పడు చాప్టర్-2 పేరుతో మేకింగ్ వీడియో రావడంతో ఆ హైప్ మరింతగా పెరిగింది.ఈసారి అయితే సాహో ఓవర్ సీస్ రైట్స్ అమ్ముడయిపోయాయి.దుబాయ్ కి చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ చైనా మినహా మిగతా హక్కులకు 50 కోట్ల మేర డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.

అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడానికి టైం పడుతుంది.సాహో రేంజ్ కి అది తగిన అమౌంట్ అనుకోవాలి.ఇక చైనా హక్కులు మరొక 50 నుండి 70 కోట్ల రేంజ్ లో అమ్ముడయ్యే అవకాశం ఉంది.బాహుబలి అనుభవంతో అక్కడ UV క్రియేషన్స్ అండ్ T సిరీస్ కలసి రిలీజ్ చెయ్యొచ్చు.మొత్తానికి సాహో ఒక రేంజ్ లో సంచలనాలు క్రియేట్ చెయ్యడం అనేది మాత్రం కన్ఫర్మ్ అయ్యింది.