శ్రీవిష్ణు హీరోగా ‘బ్రోచేవారెవరురా’ చిత్రం ప్రారంభం…!

Sri Vishnu

వివేక్ ఆత్రేయ, శ్రీవిష్ణులు కాంబినేషన్లో వచ్చిన ‘మెంటల్ మదిలో’ మంచి సక్సెస్ అందుకుంది.అయితే తిరిగి ఈ కాంబినేషన్ లో ఒక సినిమా రానుంది.దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విలక్షణ పాత్రలలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు ఒక చిత్రంలో నటించేందుకు సిద్ధం అయ్యాడు.ఈ చిత్రానికి ‘బ్రోచేవారేవరురా’ అనే పేరును ఖరారు చేసారు.

ఈ మూవీలో శ్రీవిష్ణుకి జోడిగా నివేథా థామస్, నివేథ పెతురాజ్ నటించనున్నారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ మన్యం ఈ సినిమాను నిర్మించనున్నారు. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తదితరులు ఇతర పాత్రలలో నటించనున్నారు.వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.