శివ దర్శకత్వంలో సూర్య సినిమా…!

Siva
Siva

గోపీచంద్ తో ‘శౌర్యం’ సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. తరువాత తమిళ్ స్టార్ హీరో అజిత్ తో వీరం,వివేగం సినిమాలు చేసిన శివ.తాజాగా అజిత్ హీరోగా ‘విశ్వాసం’ను తెరకెక్కించాడు. తెలుగులో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ.. తమిళంలో మాత్రం భారీ విజయాన్ని సాధించింది.దీంతో తన తర్వాతి చిత్రానికి రెడీ అవుతున్నాడు శివ. ఈసారి సూర్యతో కలసి మరో భారీ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. కథ నచ్చడంతో సూర్య ఈ ప్రాజెక్ట్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.