శంకర్ సీక్వెల్స్ కంటిన్యూస్

Shankar
Shankar

శంకర్ సౌత్ ఇండియా లోనే కాదు ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్.అయితే అతను కష్టపడి తీసిన ఐ సినిమా ఇచ్చిన డిజాస్టర్ రిజల్ట్ మాత్రం శంకర్ ని బాగా డిస్ట్రబ్ చేసినట్టు ఉంది.ఆ సినిమా తరువాత శంకర్ కొత్త సినిమాల మీద దృష్టి పెట్టకుండా తాను తీసిన సినిమాలకే సీక్వెల్స్ తీస్తున్నాడు.రోబో కి మించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ని అడాప్ట్ చేసుకుని విజువల్ వండర్స్ సృష్టిస్తాడు అనుకున్న శంకర్ కి రోబో సీక్వెల్ 2.0 కూడా అనుకున్న రేంజ్ ఫలితాన్ని ఇవ్వలేదు.

దాంతో శంకర్ సినిమా బడ్జెట్ విషయాల్లో రెస్ట్రిక్షన్స్ ఎదురవుతున్నాయి.తాను తీసిన పాత సినిమాలకే సీక్వెల్ రూపొందిస్తే ఆ సినిమా సక్సెస్ తాలూకు బ్రాండ్ నేమ్ కూడా కలిసొస్తుంది కదా అనే ఆలోచనతో శంకర్ తాను గతంలో తీసిన సినిమాలకే సీక్వెల్స్ చేస్తే బెటర్ అనే ఆలోచనకి వచ్చాడు అనేది ఓకే ఒపీనియన్.ఎలాంటి క్రియేటర్ అయినా ఒక స్థాయికి వచ్చాక ఛాలెంజెస్ అండ్ ప్రెజర్ ని తీసుకోవడానికి ఇష్టపడడు.

శంకర్ కూడా ప్రస్తుతం అదే సాచురేషన్ లెవెల్ కి చేరుకున్నట్టు ఉన్నాడు.అందుకే కొత్త సెటప్ జోలికి పోకుండా సీక్వెల్స్ తోనే బండి లాగించేస్తున్నాడు.ఆల్రెడీ రోబో కి సీక్వెల్ తీసి,భారతీయుడు సీక్వెల్ షూట్ కి సంబందించిన డిస్కషన్స్ లో ఉన్న శంకర్ ఇప్పడు బాయ్స్ కి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తునట్టు తెలుస్తుంది.ఆ సినిమా శంకర్ కెరీర్ కి ఒక చేంజ్ ఓవర్ మాత్రమే కానీ కొంతమంది జీవితాలను టోటల్ గా చేంజ్ చేసింది.

హీరో సిద్దార్థ్,హీరోయిన్ జెనీలియా,మ్యూజిక్ డైరెక్టర్ థమన్,తమిళ్ హీరో నకుల్….వీళ్లంతా బాయ్స్ సినిమాతో వెలుగులోకి వచ్చిన వాళ్ళే.వీళ్ళలో కొంతమంది మళ్ళీ ఈ సీక్వెల్ లో కూడా నటించే అవకాశం ఉంది.కానీ డైరెక్షన్ మాత్రం శంకర్ చేయకపోవచ్చు.ఎవరు డైరెక్ట్ చేసినా కూడా ఈ ట్రెండీ సీక్వెల్ కి దక్కాల్సిన క్రేజ్ అయితే దక్కుతుంది.ఇప్పటికే మూడు సినిమాల సీక్వెల్స్ టచ్ చేసిన శంకర్ ఫ్యూచర్ లో ఇంకెన్ని సీక్వెల్స్ అటెంప్ట్ చేసి తన అభిమానులనుఁ అలరిస్తాడో చూడాలి.