వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పీవీపీ ..?

pvp
pvp

ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఫ్యాను కింద‌కు రానున్నారు. ఆయ‌న బుధ‌వారం వైసిపి అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి వైసిపి అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసే అవకాశం ఉంది. వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేశ్ పోటీ చేస్తారని ఇప్ప‌టి వ‌ర‌కు ప్రచారం జరిగింది.

తాజాగా మరో పారిశ్రామికవేత్త పీవీపీ పేరు కోసం తెరపైకి వచ్చింది. విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు దాసరి జైరమేశ్ అంతగా ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో పీవీపీకి ఎంపీ సీటు ఇవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 23న ఆయన నామినేషన్‌ వేస్తారని ప్రచారం జరుగుతోంది.

గత ఎన్నికల్లోనే వైసిపి తరఫున పీవీపీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫ‌ల‌మ‌య్యారు. ఈ సారి కూడా ఆయన విజయవాడ నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడంతో వైసిపి అధినేత జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.