వైసీపీలో చేరిన తోట నరసింహం దంపతులు

Thota Narasimham
Thota Narasimham

కాకినాడ ఎంపీ తోట నరసింహం దంపతులు టీడీపీ గుడ్ బై చెప్పి ఈ రోజు ఉదయం వైసీపీలో చేరారు. తోట నరసింహం దంపతుల్ని వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతు..పార్టీ కోసం ఎంతో కమిట్ మెంట్ తో పనిచేసిన తనకు టీడీపీ తనకు చాలా అన్యాయం చేసిందనీ వాపోయారు.

ఈ క్రమంలో తనకు ఉన్న అనారోగ్యం కారణంగా తాను ఎన్నికల్లో పోటీ చేయనని తన భార్యకు కాకినాడు ఎమ్మెల్యే టిక్కె్ట్ ఇవ్వాలని తోట నరసింహం టీడీపీ అధినేత చంద్రబాబును కోరిన క్రమంలో చంద్రబాబు దానికి అంగీకరించకపోవటంతో మనస్తాపానికి గురైన తోట భార్య వాణి, కుమారుడితో కలిసి వైసీపీలో చేరామని తెలిపారు.కాగా తోట వాణి కాకినాడ సిటీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.