వైసిపి అధినేత జ‌గ‌న్ నామినేష‌న్ ఎప్పుడంటే ..!

YS Jagan
YS Jagan

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు వైసిపి అధినేత జ‌గ‌న్ స‌ర్వ‌స‌న్న‌ద్దం అయ్యారు. పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జగన్ మార్చి 22న నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం పార్టీ అభ్యర్థుల ఎంపికలో తీరిక లేకుండా ఉన్న జగన్, అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధుల పూర్తి జాబితా వెల్లడించిన తర్వాత సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టనున్నారు.

మ‌రోవైపు తొలి విడతగా 75 మంది పేర్లు వెల్లడించి, ఆపై పరిస్థితులను బట్టి రోజుకు 25 మంది చొప్పున పేర్లు ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. మొత్తం అభ్యర్థుల పేర్లన్నీ వెల్లడయ్యాక జగన్ ప్రచార బరిలో దిగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.