వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి

ys vivekananda reddy
ys vivekananda reddy

పులివెందులలో వైయస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు జ‌రిగాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు . వైయస్ రాజారెడ్డి ఘాట్ లో అంత్యక్రియలను నిర్వహించారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంతిమ కార్యక్రమాలను ముగించారు.

దీనికి ముందు వివేకా నివాసం నుంచి రాజారెడ్డి ఘాట్ వరకు అంతిమ యాత్రను నిర్వహించారు . ఈ అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. భారీ భద్రత మధ్య అంతిమయాత్రలో జగన్ తో స‌హా కుటుంబ‌స‌భ్యులు నడిచారు. అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. పలువురు ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన వైసీపీ నేతలు, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు.