వర్మ అస్సలు తగ్గడం లేదు

ram-gopal-varma
ram-gopal-varma

రామ్ గోపాల్ వర్మ తీసిన,రిలీజ్ చెయ్యబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కి హైప్ తీసుకొచ్చేందుకు RGV తనకు బాగా తెలిసిన మంత్రాన్నే మారోసారి వాడుతున్నాడు.అదే వివాదం.సినిమాలో ఫుల్లుగా చంద్రబాబు ని టార్గెట్ చేసిన వర్మ బయట కూడా అదే పద్దతిని ఫాలో అవుతున్నాడు.ఏకంగా ఎన్టీఆర్ మాట్లాడినట్టు ఒక వాయిస్ ని డబ్బింగ్ చేసి సినిమాకి సంబంధం లేకుండా ఒక వాయిస్ ని రిలీజ్ చేసాడు.అందులో వర్మ చంద్రబాబు ని ఒక రేంజ్ లో తిట్టిపోశాడు.

ఇష్టం వచ్చిన పదాలు వాడాడు.ఎంత ఎన్నికలు దగ్గరికి వచ్చినా ఒక రాష్ట్రానికి సీఎం ని ఈ రేంజ్ లో ఎదిరించడం అంటే చాలా పెద్ద రిస్క్ అనే మాట వినిపిస్తుంది.అందుకే వర్మ తనని ఏమైనా చేస్తే సినిమా యు ట్యూబ్ లో రిలీజ్ చేస్తా అని చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు.అయితే ఇదంతా చూస్తూనే లక్ష్మీస్ ఎన్టీఆర్ కేవలం RGV తీసిన ఒక సినిమాగా జనాలు భావించడంలేదు.

టీడీపీ ని ఎదుర్కునే ఒక అస్త్రంగా భావిస్తున్నారు.అందుకే RGV కి ఇన్ డైరెక్ట్ గా సాయం అందిస్తున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది.అయితే అతి తక్కువ ఖర్చుతో తీసిన ఈ సినిమా రైట్స్ ఇప్పటికే 8 కోట్లకు అమ్మారు అని టాక్ ఉంది.అది కూడా rgv జోష్ కి దూకుడికి కారణం అయ్యి ఉండొచ్చు.ఏది ఏమైనా RGV మాత్రం అస్సలు తగ్గట్లేదు.