లోక్‌స‌భ బ‌రిలో కోదండ‌రాం పార్టీ

Kodandaram
Kodandaram

లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ జనసమితి నాలుగు స్థానాలలో పోటీ చేస్తుందన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం. మిగిలిన స్థానాలలో తమ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందనిప్ర‌క‌టించారుఏ. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గాలలో టీజేఎస్ పోటీ చేస్తుందని, మరో నియోజకవర్గం ఏమిటన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు.

టీజేఎస్ పోటీ చేసే నాలుగు నియోజకవర్గాలలోనూ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్ప‌ష్టం చేశారు. మిగిలిన 13 నియోజవకర్గాలలో మాత్రం తమ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందని వెల్ల‌డించారు కోదండరామ్ .