లక్ష్మీస్ ఎన్టీఆర్ కి గ్రీన్ సిగ్నల్

Lakshmis NTR
Lakshmis NTR

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ సినిమాలో వర్మ ఏం చుపించాడో,సినిమాని ఎలా డీల్ చేసాడో తెలియదుగానీ ఈ సినిమా రిలీజ్ పరంగా మాత్రం ఒక రేంజ్ లో హడావిడి చేస్తున్నారు.ఎన్టీఆర్ ఆశీర్వదించాడు అంటూ అందరిలో వేడి రాజేస్తున్నాడు.దానికి తగ్గట్టుగానే ఈ సినిమాపై జనాలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు.ఇక బిజినెస్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ ఉంది.వర్మ మార్క్ కాంట్రవర్సీ పబ్లిసిటీ వర్క్ అవుట్ అయ్యి లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ రైట్స్ కి భారీ పోటీ ఏర్పడింది.

ముందు ఈ సినిమా రైట్స్ ని 8 కోట్లకు అమ్మారు.కానీ మళ్ళీ వేరే ఆఫర్ రావడంతో 11 కోట్ల భారీ రేటుకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయి మేకర్స్ కి భారీ లాభాలు అందాయి.ఇక ఈ సినిమాను RGV తో పాటు అగస్త్య మంజు కూడా డైరెక్ట్ చెయ్యడంతో సినిమాపై చాలా పోజిటివిటీ బిల్డ్ అయ్యింది.అన్ని రకాలుగా ఫుల్ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయంపై కూడా అందరిలో చిన్న కన్ఫ్యూషన్ ఉంది.

థియేట్రీకల్ రైట్స్ కూడా అమ్మడంతో వర్మ అన్నట్టు ఈ సినిమాని ఆన్ లైన్ లో రిలీజ్ చెయ్యడం కూడా కుదరదు.అయితే ఇప్పడు ఈ సినిమా విడుదలకు EC కూడా నో అబ్జెక్షన్ అనేశారు.ఒక సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపడం తమ పరిధిలో లేదు అని,ఒక వేళ సినిమా రిలీజ్ అయ్యాక ఏమైనా అభ్యంతరకరమైన సీన్స్ ఉంటే మాత్రం అప్పుడు కన్సిడర్ చేస్తామని చెప్పడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కి అడ్డంకులన్నీ తొలగిపోయాయి.22 న థియేటర్స్ లోకి వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కంటెంట్ తో కూడా హైప్ ని నిలబెట్టుంటుందా? లేక విషయం లేని సినిమాగా నిలుస్తుందా అన్నది ఆ రోజే తేలిపోతుంది.