రవితేజ కి కండిషన్స్ అప్లై

Ravi Teja
Ravi Teja

రవితేజ కి ప్రస్తుతం స్క్రిప్ట్స్ ఫైనల్ చెయ్యడం కాస్త కష్టంగా ఉంది.అదే విషయంలో రవితేజ కి కూడా క్లారిటీ వచ్చింది.అందుకే తన రెమ్యునరేషన్ అండ్ స్టోరీస్ సెలెక్షన్ లో పెద్దగా పట్టుబట్టట్లేదు.ఐ డిస్కోరాజా స్క్రిప్ట్ విషయంలో కూడా రవితేజ కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది.అయితే రవితేజ జడ్జ్ మెంట్ స్కిల్స్ కూడా గతంలో మాదిరిగా వర్క్ అవుట్ కావట్లేదు.

నేల టికెట్,అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాల రిజల్ట్ కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి.అందుకే కొంతమంది డైరెక్టర్స్ తమ కథలతో రవితేజ ని మెప్పించడం అనే విషయం పక్కనబెట్టి ఒప్పించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.పవన్ కళ్యాణ్ తో సినిమా ఓకే చేయించుకుని ఆ తరువాత అదే స్ర్రిప్టు ని రవితేజ కోసం మార్పులు చేర్పులతో రెడీ చేసుకున్న సంతోష్ శ్రీనివాస్ కూడా మాస్ రాజా ని లాక్ చేసాడు.

ముందు వద్దు అన్న రవితేజ తోనే ఆ సినిమాని పెట్టాలెక్కించడానికి రెడీ అయ్యాడు.ఈ సినిమాతో మైత్రి కి అటు రవితేజ,ఇటు సంతోష్ శ్రీనివాస్ ల కమిట్మెంట్ కూడా అయిపోతుంది.అందుకే కాస్త చూసుకుని,టైట్ బడ్జెట్ లో ఆ సినిమాని తెరకెక్కించడాని సన్నాహాలు చేస్తున్నారు.సాలిడ్ గా ఒకటి,రెండు హిట్స్ వచ్చేవరకు రవితేజ కి సిట్యుయేషన్ మారడం కష్టమే.