మ‌రో పొత్తుకు సిద్ద‌మైన జ‌న‌సేన

Mayawati-Pawan-Kalyan
Mayawati-Pawan-Kalyan

జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ఒంట‌రి పోరుగా అడుగులు వేస్తున్నామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని మ‌రుస‌టి రోజే యు ట‌ర్న్ తీసుకున్నారు. ఇప్ప‌టికే వామ‌ప‌క్షాల‌తో స‌ర్ధుబాట్లు వుంటాయ‌ని చెప్పిన జ‌న‌సేన పార్టీ మ‌రో పొత్తుకు సిద్ద‌మైంది. లక్నో లో బీఎస్పీ అధినేత్రి మాయావతి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలకు కలసి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి డిసైడ్ అయ్యారు. . తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీ , జనసేన, ఇతర కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీచేస్తుందని ప్ర‌క‌టించారు. దేశంలో ఇతర కూటముల కంటే తమ కూటమే బలంగా ఉందని స్పష్టం చేశారు.

తమ మధ్య సీట్ల కేటాయింపు, పంపకాల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు రాలేదని నాయ‌కులు వివ‌రించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మాయావతిని భారత ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. బడుగుబలహీన వర్గాలకు జనసేన అండగా ఉంటుందని తేల్చి చెప్పారు.