మ‌రో ఎంపి తెలుగుదేశానికి గుడ్ బై..?

Thota narasimham
Thota narasimham

కాకినాడ ఎంపీ తోట నరసింహం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్ప‌నున్న‌ట్లు తెలిసింది.పెద్దాపురం నుండి అసెంబ్లీ అభ్యర్థిగా తోట నరసింహం భార్య వాణి టిడిపి నుంచి టికెట్ ఆశించారు. దీనిపై టికెట్ పై హామీ దక్కకపోవడంతో వైసీపీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. బుధ‌వారం వైసిపి అధినేత జగన్ సమక్షంలో తోట దంపతులు వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. ఈ నేప‌ధ్యంలోనే తోట వాణి పెద్దాపురం నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నార‌ని స‌మాచారం.