మ‌చిలీప‌ట్నం ఎంపి స్థానానికి టిడిపి అభ్య‌ర్ధిగా వంగ‌వీటి రాధా.. ?

vangaveeti radha
vangaveeti radha

ఇటీవ‌లే వైసిపికి గుడ్ బై చెప్పి ఏ పార్టీలోనూ చేర‌కుండా స‌స్పెన్స్ క్రియేట్ చేసిన వంగవీటి రాధాకృష్ణ మ‌న‌సు మార్చుకున్నారు. ఆయ‌న అధికార తెలుగుదేశం పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. అర్ధ‌రాత్రి వంగ‌వీటి రాధాతో సిఎం చంద్ర‌బాబు సుమారు రెండు గంట‌ల పాటు చర్చ‌లు జ‌రిపారు. వంగవీటి రాధకు అసెంబ్లీ సీటును కేటాయించలేమని తేల్చేశారు.

అయితే తేలుగుదేశం పార్టీ మచిలీపట్నం లోక్ స‌భ స్థానానికి అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణను ఖరారు చేశారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ స్థానానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ను పెడ‌న అసెంబ్లీ బ‌రిలో నిల‌ప‌నున్నారు. రెండు రోజుల్లో వంగవీటి పార్టీలో చేరికపై ఆయనే స్వయంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.

ఎంపీగా పోటీ చేస్తే, ఆపై ఫలితం తారుమారైనా రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటామని అభ‌యం ఇచ్చిన‌ట్లు స‌మాచారం. విజయవాడకు జరిగే మునిసిపల్ ఎన్నికల్లో రాధ అనుచరులకు ప్రాతినిధ్యం కల్పిస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.