మే 1న విడుదల అవుతున్న ‘అర్జున్ సురవరం’

Arjun Suravaram
Arjun Suravaram

టి సంతోష్ దర్శకత్వంలో యంగ్ హీరో  నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘అర్జున్ సురవరం’. ఈ సినిమాను మూవీ డైనమిక్స్, ఆరా సినిమా ప్రై.లి పతాకాలపై రాజ్‌కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.మే 1న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో హీరో నిఖిల్ మాట్లాడుతూ అర్జున్ సురవరం నా 16వ సినిమా. నా సక్సెస్‌కు కారణమైన మీడియావాళ్లపై సినిమా చేయడం రెస్పాన్సిబుల్‌గా ఫీలయ్యాను. జర్నలిస్టు పాత్రలో కనపడతాను. ఈ సినిమా చేయడానికి ముందు కాస్త భయపడ్డాను.

కత్తిమీద సాములాంటి సినిమా. నా కెరీర్‌లో చాలా బాధ్యతగా ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా. ఓ ప్రభుత్వం నిలబడాలన్నా, కూలిపోవాలన్నా,యుద్ధం మొదలు కావాలన్నా,ఆగిపోవాలన్నా మీడియా కీ రోల్ పోషిస్తుంది. పవర్‌ఫుల్ మీడియాను రిప్రజెంట్ చేయడం గర్వంగా ఉంది. ప్రజలంతా ఎలక్షన్ మూడ్‌లో ఉన్నారు.చాలా కాంట్రొవర్సీలు కూడా ఉన్నాయి. వాటన్నింటికీ దూరంగా మా సినిమాను మే 1న విడుదల చేయడానికి నిర్ణయించామన్నారు.