‘మా’ అధ్యక్ష ఎన్నికలలో నరేష్ విజయం…!

MAA
MAA

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొదట ప్రచారం సందర్భంగా రెండు ప్యానల్స్‌ ఎలా పోటీపడినప్పటికీ. పోలింగ్‌ సందర్భంగా ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకుంటూ కనిపించారు. అధ్యక్ష పదవి కోసం బరిలో దిగిన శివాజీ రాజా, నరేష్‌ ప్యానల్స్‌ మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేశ్ విజయం సాధించాడు.

ఆదివారం హైదరాబాద్‌, ఫిలించాంబర్‌లో జరిగిన మా ఎన్నికల పోలింగ్‌ ఉదయం 8 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది.గతంలో పోలింగ్‌కు ఈవీఎంలు ఉపయోగించగా.ఈసారి బ్యాలెట్‌ పత్రాలను వినియోగించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.. అసోసియేషన్ అధ్యక్షుడిగా నరేశ్ ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా జీవితారాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల గెలుపొందారు.

కేరక్టర్ నటి హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరీ గెలుపొందడం గమనార్హం. మా ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు, శివబాలాజీ విజయం సాధించగా.. ట్రెజరర్‌గా కోట శంకర్రావుపై రాజీవ్ కనకాల గెలుపొందారు. ఇక ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఓటింగ్ పూర్తికాగా.. రాత్రి లోపే ఫలితాలు వెలువడుతాయని అంతా భావించారు. అయితే ఉత్కంఠ రేకెత్తిస్తూ మా ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది.

ఈ సారి మా ఎన్నికల్లో 472 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక ఈసీ మెంబర్స్‌ విజయం సాధించినవారి వివరాలు.. 1. అలీ, 2. రవిప్రకాష్, 3. తనికెళ్ల భరణి, 4. సాయికుమార్, 5. ఉత్తేజ్, 6. పృథ్వి, 7. జాకీ, 8.సురేష్ కొండేటి, 9. అనితా చౌదరి, 10. అశోక్ కుమార్, 11. సమీర్, 12. ఏడిద శ్రీరామ్, 13.రాజా రవీంద్ర, 14. తనీష్, 15. జయలక్ష్మి, 16. కరాటి కళ్యాణి, 17. వేణుమాధవ్, 18. పసునూరి శ్రీనివాస్ గెలుపొందారు.