మార్చ్ 17న విజయ్ దేవరకొండ కొత్త సినిమా టీజర్…!

Dear Comrade
Dear Comrade

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రెడ్’.ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.కాగా ఈ సినిమా టీజర్ ఈ నెల 17న విడుదల కానుంది. తాజాగా దీనికి సంబందించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విజయ్ విద్యార్థి నాయకుడిగా, రష్మిక క్రికెటర్‌గా నటిస్తున్నారు.

ఈ చిత్రం  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 17న టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.