మార్చి 14 న ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్రెస్ మీట్…!

RRR
RRR

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమా షూటింగ్ కోల్ కతాలో జరుగుతుంది. అయితే సినిమా విశేషాలు అభిమానులతో పంచుకునేందుకు రాజమౌళి మార్చి 14 వ తేదీన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.

ఆ రోజున ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను మీడియాతో పంచుకోబోతున్నారు. చాలా కాలం నుంచి కలిగించిన క్యూరియాసిటీకి రేపటితో తెరపడబోతున్నది. ఈ సమావేశంలో రాజమౌళి ఇవేం చెప్పబోతున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.కాగా ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై దానయ్య నిర్మిస్తున్నారు.