మహేష్ సినిమాలో కన్నడ స్టార్ హీరో

Upendra
Upendra

భరత్ అనే నేను సినిమాతో కష్టపడి సక్సెస్ ట్రాక్ ఎక్కిన మహేష్ డైరెక్టర్ ఎవరయినా,ఎంత పెద్ద హిట్ కొట్టినా కూడా తన సినిమా స్క్రిప్ట్ విషయంలో మాత్రం చాలా పక్కాగా ఉంటున్నాడు.గతం గతహా అనే సూత్రాన్నే పాటిస్తూ స్క్రిప్ట్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు.మహేష్ తీసుకున్న ఈ డెసిషన్ వల్లే రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్,అర్జున్ రెడ్డి లాంటి పాత్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ అందించిన సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ తో సినిమా చేసే చాన్ మిస్ చేసుకున్నారు.

అనిల్ రావిపూడి తో తన 26 వ సినిమా కన్ఫర్మ్ చేసిన మహేష్ అక్కడ కూడా నో కాంప్రమైజ్ అంటున్నాడు.కాకపొతే స్వతహాగా స్పార్క్ ఉన్న రైటర్ అయిన అనిల్ మహేష్ క్లూస్ కి అనుకూలంగా స్టోరీ డిస్ట్రబ్ కాకుండా ట్రాక్స్ అల్లుకుంటూ పోతున్నాడు.ఈ సినిమాకోసం అనిల్ కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నాడు.కాకపోతే ఇప్పటివరకు వచ్చిన అనిల్ సినిమాలన్నిటిలో హీరో పాత్ర చుట్టే సినిమా తిరుగుతుంది.

అది ఫిక్స్ అయిన కమర్షియల్ మీటర్ ఫార్మాట్.అయితే మహేష్ సినిమాకి అది సరిపోదు.అందుకే కొన్ని వేరే పాత్రలు కూడా డిజైన్ చేస్తున్నారు.విజయశాంతి,ఉపేంద్ర లాంటి పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్టులను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్రలు తీర్చిదిద్దుతున్నాడు.విజయశాంతి మహేష్ సినిమాలో నటిస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.కానీ ఉపేంద్ర మహేష్ సినిమాలో నటించడం మాత్రం ఆల్మోస్ట్ ఫిక్స్.కాకపోతే ఫార్మాలిటీ గా కథ వినాలి.

మహేష్ కథల విషయంలో కేర్ ఫుల్ గా ఉంటున్నాడు కాబట్టి ఆ ఉపేంద్ర కి ఈ స్టోరీ నచ్చుతుంది అనే విషయంలో నో డౌట్.ఇక రెమ్యునరేషన్ పరంగా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు.పైగా ఉపేంద్ర తెలుగు సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు.అయితే అనిల్ ఎంచుకున్న నటీనటులను చూస్తుంటే అతను గత సినిమాల్లా ఇది కేవలం కామెడీ తో బండి నడిపించేసే సిల్లీ వ్యవహారం కాదు అని అర్ధమవుతుంది.

మరి ఈ సినిమాని అనిల్ రావిపూడి ఏ యాంగిల్ లో ఎలా డీల్ చేస్తాడో చూడాలి.స్టార్ డైరెక్టర్ అనే స్టేచర్ కి ఒక్క అడుగు దూరంలో ఉన్నఅనిల్ ఐదో సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడు అనేది తేలాలంటే మాత్రం టైం పడుతుంది.