మహేష్ తో కలిసి న్యూఇయర్ జరుపుకోండి అంటున్న ‘మహర్షి ‘ యూనిట్…!

Mahesh Babu,Maharshi

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తోన్న తాజా చిత్రం ‘మహర్షి’ .ఈ చిత్రంలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రంఫై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఇంకొక హాట్ అప్‌డేట్ రానుంది.

మహేష్‌ బాబు కొత్త సంవత్సరం నాడు అభిమానులు గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో మహేష్‌ పాత్రకు సంబంధించిన కొత్త లుక్‌ను రేపు సాయంత్రం విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు ప్రకటించారు. ‘రిషితో కలిసి న్యూఇయర్‌ వేడుకను జరుపుకోండి. రేపు ఇదే సమయానికి అతడిలోని మరో కోణాన్ని చూడండి’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ‘డిసెంబరు 31న సాయంత్రం 6.03 గంటలకు ‘రిషి’తో మీ అపాయింట్మెంట్‌ ఫిక్స్‌. అతడి ప్రయాణంలో భాగం అవ్వండి’ అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రని దిల్‌రాజు, అశ్వినిదత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.