మరో రికార్డు సాధించిన రామ్ చరణ్ సినిమా…!

Rangasthalam
Rangasthalam

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్,సమంతా హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రంగస్థలం’.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా తాజాగా మరో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది.మహాశివరాత్రి కానుకగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమాను ప్రదర్శించగా 1లక్షా 40 వేలు రూపాయలు రెండు స్క్రీన్లకు కలిపి వసూలు చేసి ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది శివరాత్రి స్పెషల్ గా వేసే ఏ సినిమాకు కూడా ఇంత పెద్ద మొత్తంలో రాలేదట.