మజ్ను నీ దారెటు

Mr Majnu Movie

కెరీర్ ఎప్పుడో స్టార్ట్ చేసి ఇప్పటివరకు రెండు సినిమాలు చేసిన అఖిల్ ఒక్క హిట్ కూడా అందుకోలేదు.అందుకే చాలా కష్టపడి ఒక స్టోరీ ఓకే చేసుకుని దాన్ని ఇష్టపడి మరీ చేస్తున్నాడు.అదే మిస్టర్ మజ్ను.ఆ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అండ్ రీసెంట్ గా వచ్చిన అఫీషియల్ ఫస్ట్ లుక్ లో ఈ సినిమాలో బోలెడంత బోల్డ్ కంటెంట్ ఉంటుంది అని కన్వే చేసారు.ఈ సినిమాకి పెట్టిన బాయ్స్ విల్ బి బాయ్స్ అనే ట్యాగ్ లైన్ కూడా దాన్నే సూచిస్తుంది.ఇక ఈ సినిమాలో అఖిల్ పాత్రకి నిజజీవితంలో అతని పాత్రకి కాస్త పోలికలు కూడా ఉన్నాయి అని టాక్.

అంతా ఓకే…కానీ ఈ సినిమా నుండి రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ అసలు ఈ సినిమా థీమ్ ఏంటి అనే కన్ఫ్యూషన్ ని క్రియేట్ చేస్తున్నాయి.ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన మూడుపాటల్లో రెండు పాటలు మాత్రం బ్రేక్ అప్ లోని పెయిన్ ని తెలుపుతూ సాగుతున్నాయి.అంటే ముందు అల్లరి చిల్లరిగా తిరిగిన ఒక టీనేజర్ తరువాత లవ్ లో గొప్పదనం తెలుసుకుని,ఆమెని కలుసుకోవడం అనే రొటీన్ పాయింట్ ఈ సినిమా లైన్ అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది.కాకపోతే తొలిప్రేమ సినిమాకి కూడా ఇలాంటి సాదాసీదా లైన్ నే తీసుకుని సూపర్ హిట్ డెలివర్ చేసాడు వెంకీ అట్లూరి.

మళ్ళీ ఈ సినిమాకి కూడా అదే మ్యాజిక్ రీ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.పాటలు వినడానికి బావున్నాయి.ఫీల్ కూడా ఉంది.సినిమాలో సిట్యుయేషన్స్ పరంగా వస్తూ కథలో ఇన్వాల్వ్ అయిపోతే ఇబ్బంది లేదు.కానీ స్టోరీ లైన్ మొత్తం ఇలా డాల్ మూడ్ లోనే సాగితే మాత్రం సూపర్ హిట్ కొట్టాలి అనే అఖిల్ ఆశ ఈ సారి కూడా నెరవేరకపోవచ్చు.ఈ భారీ బడ్జెట్ సినిమా అఖిల్ కి మాత్రమే కాదు ఆ సినిమా హీరోయిన్ నిధి అగార్వల్,డైరెక్టర్ వెంకీ అట్లూరి లకు కూడా ఈ సినిమా సక్సెస్ కీలకంగా మారింది.