మజిలీ కష్టాలు తీరేదెలా?

Majili Movie
Majili Movie

పెళ్లయిన తరువాత సమంత-చైతు కలిసి జంటగా నటుస్తున్న మజిలీ సినిమాపై ముందునుండి పోసిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యింది.టీజర్స్ అండ్ ట్రైలర్స్ వల్ల అది మరింతగా పెరిగింది.తన మొదటి సినిమా నిన్నుకోరి తో ఫుల్ ఫిల్డ్ లవ్ స్టోరీ చూపించిన శివ నిర్వాణ మజిలీ తో కూడా మళ్ళీ ఎదో మ్యాజిక్ చెయ్యబోతున్నాడు అనే విషయం పాటలద్వారా అర్ధమైంది.

అలా ఫుల్ స్వింగ్ లో ఉన్న మజిలీ కి మహర్షి పోస్ట్ ఫోన్ అవడంతో ఉగాది అనే పర్ఫెక్ట్ డేట్ కూడా దక్కింది.జెర్సీ కూడా కాంప్రమైజ్ అయ్యి డేట్ మార్చుకోవడంతో మజిలీ సోలో గా కుమ్మేస్తుంది అనుకున్నారు అంతా.ఆల్ ఈజ్ వెల్ అనుకున్న టైం లో ఈ సినిమాకి పొలిటికల్ పోటు ఇబ్బందిగా మారింది.నిజానికి ఈ సినిమాకి,పాలిటిక్స్ కి ఎలాంటి సంబంధం లేదు.

కానీ ఈ సినిమా రిలీజ్ అవుతున్న ఏప్రిల్ 5 కి ఎలక్షన్స్ కి కేవలం ఒక వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉంటుంది.అంత హడావిడిలో తీరుబడిగా సినిమాకి వచ్చే జనాల సంఖ్య ఖచ్చితంగా తగ్గుతుంది.ముఖ్యంగా సినిమాకి అతి కీలకమయిన ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది.

ఆ టైం లో మీడియా ఫోకస్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఎలెక్షన్స్ పైనే ఉంటుంది.సో,ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ ఎలెక్షన్స్ ఎఫెక్ట్ మజిలీకి చేటు చెయ్యడం ఖాయం గా కనిపిస్తుంది.మరి ఈ టైం లో రిలీజ్ పై మజిలీ టీమ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.