మంగ‌ళ‌గిరి నుంచి నారా లోకేష్ పోటీ

Nara Lokesh,WEF annual meeting,Davos,Switzerland, Andhra pradesh
Nara Lokesh,WEF annual meeting,Davos,Switzerland, Andhra pradesh

అక్క‌డ‌న్నారు.. ఇక్క‌డ‌న్నారు … చివ‌ర‌కు మంత్రి లోకేష్ పోటీ చేసే స్థానంపై తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి బీమిలి, విశాఖ ఉత్త‌రం ఇలా ప‌లు స్థానాలు అని చెబుతూ చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి త‌న‌యుడు నారా లోకేష్ మంగ‌ళ‌గిరిని ఫైన‌ల్ చేసుకున్నారు.

మంగళగిరిలో తెలుగుదేశం బ‌లంగా ఉన్న నేపథ్యంలో ఆయ‌న పోటీచేస్తే విజయం నల్లేరుపై నడకలా మారుతుందని పార్టీ కేడ‌ర్ భావిస్తోంది. తాజాగా లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి దిగబోతున్న నేపథ్యంలో ఆయన‌పై దీటైన అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దింపేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది.