బాలయ్య-బోయపాటి సినిమా ఓపెనింగ్ డేట్…!

Boyapati Srinu, Nandamuri, Balakrishna, Vinaya Vidheya Rama, Pre Production,
Balakrishna

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ముహూర్తం ఖరారైంది. మార్చి 28 వ తేదీన సినిమా ఓపెన్ కాబోతున్నది. బాలకృష్ణ తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. సినిమా ఓపెనింగ్ జరిగిన తరువాత బాలయ్య ఎన్నికల ప్రచారంలో బిజీ అవుతారు.

ఎన్నికలు పూర్తయ్యాక, వీరి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ బయోపిక్ తో చేదు అనుభవం అందుకున్న బాలకృష్ణ, వినయ విధేయ రామ ప్లాప్ తెచ్చుకున్న బోయపాటి కి హిట్ అవసరం. దీంతో వీరిద్దరు ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు.