బన్నీ.. మహేష్ లకు నో ఇన్విటేషన్?

banny, maheshbabu, allu, alluarjun, rajamouli ssrajamouli, aravind, chiranjivi, jaipur

రమా.. రాజమౌళి కుమారుడు కార్తీక్ వివాహానికి పింక్ సిటీ జైపూర్ వేదికగా మారినది. రాజమౌళి సర్కిల్ అనే పలువురు హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు ఛలో అంటూ జైపూర్ వెళ్ళారు.ఇంకా వెళ్లాల్సిన వారూ వున్నాయి. అయితే ఈ జాబితో కనిపించని హీరోలు ఇద్దరు వున్నారు. ఒకరు మహేష్ బాబు, అల్లు అర్జున్.

ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల ప్రకారం గా రాజమౌళి ఫ్యామిలీ నుంచి మహేష్ కు, బన్నీకి ఇన్విటేషన్ అందలేదని తెలుస్తోంది. మహేష్ దుబాయ్ వెళ్ళారని .ఇండియాకు ఈ టైమ్ కు రావాల్సి వుందని, మధ్యలో నే మనసు మార్చుకుని దుబాయ్ వెళ్లారని వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవికి, అల్లు అరవింద్ కు ఇన్విటేషన్లు అందినవని , బన్నీకి మాత్రం రాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సమాధానం కూడా అక్కడే ఉంది. రాజమౌళి తన సన్నిహితులను, తనతో అనుబంధం పెనవేసుకున్నవారిని మాత్రమే జైపూర్ కు ఆహ్వానించారని తెలుసొంది. హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు మిగిలిన వారిని పిలిచారని టాక్ వినిపిస్తోంది.