బన్నీ కొత్త సినిమా టైటిల్ అదేనా?

Stylish Star Allu Arjun
Stylish Star Allu Arjun

బన్నీ అండ్ త్రివిక్రమ్ క కాంబినేషన్ లో మూడో సినిమా పట్టాలెక్కే ముహూర్తం దగ్గరపడింది.జులాయి,సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత ఈ సినిమాతో మరో సారి జతకడుతున్నారు.దాంతో ఈ సినిమాలో ఎలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకుంటున్నారు అనే విషయంపై చాలా క్యూరియాసిటీ ఏర్పడింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మళ్ళీ ఫాదర్ అండ్ సన్ అనే ఎమోషన్ నే కొర్ పాయింట్ గా తీసుకుంటున్నారు అనే మాట వినిపిస్తుంది.అయితే బన్నీ అండ్ త్రివిక్రమ్ ల కలయికలో రూపొందిన గత చిత్రంలో కూడా ఇదే కాన్సెప్ట్ ని తీసుకున్నారు.మరి ఈ సారి ఇదే పాయింట్ అంటే దానికి త్రివిక్రమ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాడు అనేది చూడాలి.

టైటిల్ కూడా నేను…నాన్న అని పెట్టారు.అయితే టైటిల్ అలా ఉన్నా కూడా సినిమా మాత్రం పూర్తిగా హిలేరియస్ అవుట్ ఫుట్ తో ఉంటుంది అని క్లారిటీ ఉంది.అలాగే ఈ సినిమాలో త్రివిక్రమ్ సెలెక్ట్ చేసిన పూజ హెగ్డే,బన్నీ సజెస్ట్ చేసిన కేథరిన్ ట్రెసా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతుంది.