ఫ్యాన్ కింద‌కు పారిశ్రామికవేత్త పివిపి

PVP
PVP

ఎట్ట‌కేల‌కు ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వర ప్రసాద్ ఫ్యాన్ కింద‌కు చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో పార్టీ అధినేత జగన్ సమక్షంలో పివిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పీవీపీకి జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . పొట్లూరి వరప్రసాద్‌ విజయవాడ పార్లమెంట్‌ స్థానం నుంచి వైసిపి అభ్య‌ర్ధిగా పోటీ చేయనున్నారు.

ఈ సంద‌ర్భంగా పారిశ్రామిక వేత్త పొట్లూరి వర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ… ఏపీ అభివృద్ధివిష‌యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్ కు విజన్‌ ఉందన్నారు. రాజకీయాలు కాదు… విజయవాడ అభివృద్ధే తన లక్ష్యమన్నారు ఆయ‌న‌. వైఎస్‌ ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నానన్నారు. విజయవాడ నుంచి ఎంపీ సీటుకు పోటీ చేయాలని జగన్‌ ఆదేశించారని వివ‌రించారు.