ప్రేమకథా చిత్రం ట్రైలర్:అదే హారర్ కామెడీ

Prema Katha Chitram 2
Prema Katha Chitram 2

మారుతీ నేతృత్వంలో తెరకెక్కిన ప్రేమకథాచిత్రం ఎలాంటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.హారర్ కామెడీ సినిమాలకు అదొక రోల్ మోడల్ గా నిలిచిపోయియింది.ఆ సినిమా సాధించిన సంచలన విజయం వల్లే కోకొల్లలుగా హారర్ కామెడి సినిమాలు వచ్చాయి.అయితే ప్రేమకథా చిత్రం తరహాలోనే,అదే జోనర్ లో ఆ సినిమా సీక్వెల్ తెరకెక్కింది.

సుమంత్ అశ్విన్,నందితా శ్వేతా,సిద్ది ఇద్నాని ముఖ్య పాత్రల్లో ఆ సినిమా తెరకెక్కుతుంది.ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.బాగా అరిగిపోయిన టెంప్లేట్ ని పట్టుకుని నవ్విస్తూ,భయపెడుతూ పాస్ అవ్వాలనే ధోరణి ఆ ట్రైలర్ లో కనిపిస్తుంది.దయ్యం చేతిలో చిక్కి అల్లాడే పాత్రలు పడే పాట్లు కామెడీ ని జనరేట్ చేసే ఫన్ మీద ఈ సినిమా విజయ అనేది ఆధారపడి ఉంది.