ప్రియాంక గాంథీ పోటీలో వుండ‌రా ..!

priyanka-gandhi
priyanka-gandhi
ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే కాంగ్రెస్ పార్టీ  ముంద‌డుగు వేసింది.  రెండు ప్ర‌ధాన రాష్ట్రాల‌లో 15 మంది అభ్య‌ర్ధుల‌తో తొలి జాబితాను ప్ర‌క‌టించింది.  ఉత్తరప్రదేశ్ లో 11 మంది,  గుజరాత్ నుంచి   న‌లుగురును  కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను  వెల్ల‌డించింది.  ఈ జాబితాలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సిట్టింగ్‌ స్థానం అమేథీ నుంచి పోటీకి దిగుతున్నారు. 

యూపీఏ చైర్ పర్సన్‌ సోనియా గాంధీ కూడా రాయబరేలీ నుంచి ఎన్నికల బరిలో వుండ‌నున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ సోదరి, ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ‌గా మారింది. గ‌తంలో తల్లి, సోదరుని నియోజకవర్గాల్లో ప్రచారానికే పరిమితమైన ప్రియాంక గాంధీ ఈ ఏడాది ప్రారంభంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

అయితే సోనియా గాంధీ రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుతారని, తన స్థానంలో కుమార్తెను రంగంలోకి దింపుతారని అంతా భావించారు. కానీ తొలి జాబితాలో ఆమె పేరు లేక‌పోవ‌డంతో ఈసారి కూడా ఆమె పోటీ చేయరని అంటున్నారు . ఏది ఏమైనా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం వుండ‌టంతో ప్రియాంక బ‌రిలో వుంటారా లేక ప్ర‌చారానికే ప‌రిమితం అవుతారో వేచి చూడాల‌ల్సిందే.