ప్రాజెక్టుల బాట‌లో సిఎం కేసీఆర్…!

ఇంటింటికీ న‌ల్లా నీళ్లు ఇస్తాన‌ని అభ‌యం ఇచ్చిన అప‌ర భ‌గీర‌ధుడు సిఎం కేసీఆర్‌.రెండ‌వ‌సారి ముఖ్య‌మంత్రి గా ప్ర‌మాణ స్వీకారం చేయ‌గానే నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు.తొలి స‌మీక్ష‌ను మిష‌న్ భ‌గీర‌ధ‌, మిష‌న్ కాక‌తీయ ప‌ధ‌కాల ప‌నితీరుపై సంబంధిత అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.ఇప్పుడు కొత్త ఏడాది ప్రారంభం రోజునే ప్రాజ‌క్టుల బాట ప‌ట్టారు.ఆయ‌న స్వ‌యంగా ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించనున్నారు.ఇందులో భాగంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ సంద‌ర్శంచ‌నున్నారు.

మేడిగడ్డ ఆనకట్ట, కన్నేపల్లి పంపు హౌస్‌, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు,పంప్ హౌస్ లను కేసీఆర్‌ పరిశీలించనున్నారు. వచ్చే సీజన్‌లో కాళేశ్వరం ద్వారా నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రాజెక్టు పరిశీలన అనంతరం కేసీఆర్‌ రాత్రి కరీంనగర్‌లో బస చేయనున్నారు.బుధ‌వారం శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం పనులను సిఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.విశ్రాంత ఇంజనీర్ల బృందం ప్రాజెక్టుల వివరాలను సీఎంకు అందించనున్నారు.