పెళ్లి చేసుకోబోతున్న యాక్షన్ హీరో !

Vishal, Tamilhero, Socialmedia, Viral, GKReddy,

తమిళ యాక్షన్ హీరో విశాల్ త్వరలోనే పెళ్లి అట. ప్రస్తుతం కోలీవుడ్ లో మరియు సోషల్ మీడియాలో ఈ న్యూసే వైరల్ గా ఉంది. విశాల్ తండ్రి ప్రముఖ నిర్మాత జికె రెడ్డి మాట్లాడుతూ.. అనిషా అనే అమ్మాయితో విశాల్ పెళ్లి నిశ్చయమైందని తెలిపారు. త్వరలోనే వారి నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరుగుతుందని చెప్పారు.

మొత్తానికి విశాల్ ఒక ఇంటివాడు కాబోతున్నాడన్నమాట. ఇన్నాళ్లు పెళ్లి గురించి అడిగితే నడిగర్ సంఘం భవనం నిర్మించిన తర్వాత చేసుకుంటానంటూ చెప్పే విశాల్.. ఇప్పుడు చెప్పినట్లుగానే నడిగర్ సంఘం భవనం నిర్మిస్తున్నారు.