పెండింగ్ స్థానాల‌పై బాబు వ్యూహ‌ర‌చ‌న

AP CM Chandra Babu Naidu
AP CM Chandra Babu Naidu

తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అభ్య‌ర్ధుల తొలి జాబితా పూర్త‌యిన‌ప్ప‌టికీ అధికారికంగా ప్ర‌క‌టించాల్సివుంది. అయితే ఈ లోపు ఆ పార్టీ అధినేత సిఎం చంద్ర‌బాబు పెండింగ్‌ స్థానాల అభ్యర్థులపై వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. అన్ని ర‌కాలుగా ధీటైన అభ్య‌ర్ధుల‌ను బ‌రిలోకి దించేందుకు క‌స‌ర‌త్లు చేస్తున్నారు.

20 నుంచి 30 పెండింగ్‌ స్థానాలపై చంద్రబాబు ఆ ప్రాంత నేతలతో స‌మావేశం అయ్యారు. సొంత జిల్లా చిత్తూరు ప‌రిధిలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, మదనపల్లి, తంబళ్లపల్లి నేతలతో సమీక్షలు నిర్వ‌హించారు. అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక వద్ధ పెట్టి గెలుపు గుర్రాలు కోసం అన్వేషిస్తున్నారు.

ఇంకా కొలిక్కిరాని నియోజ‌క‌ వ‌ర్గాలు బాపట్ల, పామర్రు, కైకలూరు, కడప, బద్వేల్‌, డోన్‌, నందికొట్కూరు, సింగనమల , మాచర్ల, మార్కాపురం, ఎర్రగొండపాలెం, పోలవరం, గోపాలపురం స్థానాలపై కూడా టిడిపి అధినేత చంద్రబాబు సమీక్షించారు.