పులిజూదం:లావిష్ అండ్ ఇంట్రెస్టింగ్

Puli Joodham
Puli Joodham

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్,తమిళ్ స్టార్ హీరో విశాల్,తెలుగు వెటరన్ హీరో మెయిన్ రోల్స్ లో తెరకెక్కిన మల్టీ లింగువల్,మల్టీ స్టారర్ మూవీ పులిజూదం.వెన్ గుడ్ ఈజ్ బ్యాడ్ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ తో వస్తుంది ఈ సినిమా.తెలుగు,తమిళ్,కన్నడ భాషల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా.హన్సిక,రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎదో ఉంది అని అర్ధమవుతుంది.

నిజానికి ఈ సినిమాని ముందే మలయాళంలో తెరకెక్కించి ఆల్రెడీ విలన్ అనే పేరుతో రిలీజ్ చేశారు.ఇప్పడు అదే సినిమాకి కొత్తగా ట్రైలర్ కట్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాలో తెలుగు వాళ్లందరికీ పరిచయం ఉన్న ఆర్టిస్టులు నటించడం తో ఈ సినిమాని హోలీ సందర్భంగా ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు.అయితే హీరోలందరి ఒరిజినల్ వాయిస్ లతో డబ్బింగ్ చెప్పడంతో ఈ సినిమా అవుట్ ఫుట్ క్వాలిటీ గా ఉంది.

అయితే మోహన్ లాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన పులిమురుగన్ సినిమాని తెలుగులో మన్యం పులి పేరుతో తెరకెక్కించారు.అది ఇక్కడ కూడా కమర్షియల్ హిట్ గా నిలిచింది.అందుకే అదే పేరుని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.మరి పులి సెంటిమెంట్ కలిసొచ్చి ఈ సినిమా కూడా ఫ్యూచర్ లో మోహన్ లాల్ ప్రతి సినిమాకి ఈ పులి అనేది కామన్ ట్యాగ్ గా మారుతుందేమో.