“పీఎమ్ నరేంద్ర మోడీ” విడుదల తేది ఖరారు…!

PM Narendra Modi

ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో వివేక్ ఒబ్రేయ్ ప్రధాన పాత్రలో నరేంద్ర మోడీ జీవితకథ ఆధారంగా తెరేక్కేకుతున్న చిత్రం “పీఎమ్ నరేంద్ర మోడీ “.ఈ సినిమా వచ్చేనెల 12 న విడుదలవుతుంది . ప్రధాని నరేంద్ర మోడీ జీవితంపై రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ అహ్మదాబాద్ , ఉత్తరాఖండ్ , ముంభైలో జరిగింది.ఈ సినిమాను సందీప్ సింగ్ సురేష్ ఒబెరాయ్ నిర్మిస్తున్నారు.

నరేంద్ర మోడీ జీవితం చాలా విలక్షణమైనది , విభిన్నమైనది . టీ అమ్మే బాయ్ గా జీవితం మొదలు పెట్టిన మోడీ అంచెలంచెలుగా ఎదిగిన క్రమం , రాజకీయాల్లోకి ఎలా చేరారు , గుజరాత్ ముఖ్యమంత్రిగా పాలన ఎలా సాగింది . 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున ప్రధాన మంత్రి అభ్యర్థి ఎలా కాగలిగారు అనేక అంశాలు ఈ సినిమాలో తెరకెక్కించారు.