పార్టీ ఆదేశిస్తే ఎక్క‌డి నుంచైనా పోటీ – రేవంత్ రెడ్డి

Revanth-reddy
Revanth-reddy

పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా తాను పోటీకి రెఢీ అన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకుడిగా అధిష్ఠానం ఆదేశించినట్లు నడుచుకోక తప్పదన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా కూడా పార్టీ కార్యకర్తలు, శ్రేణుల్లో.. ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం వుంద‌న్నారు ఆయ‌న‌.

సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వార్ జోన్‌లో ఉన్నాయని ఆయ‌న అభిప్రాయపడ్డారు. పోరాడే సమయంలో నాయకుడు పోరాడాల్సిందేనని, ఇది తన బాధ్యత అనుకుంటున్నానని వివ‌రించారు.