పార్టీ అధినేత‌ల పోటీపైనే అంద‌రి దృష్టి

pawan-kalyan-ys-jagan-chandrababu
pawan-kalyan-ys-jagan-chandrababu

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో అన్ని రాజీకీయ పార్టీలు ఎన్నిక‌ల ర‌ణ రంగానికి రెఢీ అయ్యాయి. వీలైనంత త్వ‌ర‌గా అభ్య‌ర్ధుల జాబితాల‌ను ప్ర‌క‌టించి ప్ర‌చారాన్ని ప‌రుగులు తీయించాల‌నే ల‌క్ష్యంతో ఆయా పార్టీల అధినేత‌లు వ్యూహ ర‌చ‌న చేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలోనే ప్ర‌ధాన పార్టీల అధినేత‌లు పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల‌పై అంద‌రి దృష్టి వుంది.

ఇప్ప‌టికే తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుకు చిత్తూరు జిల్లా కుప్పం, వైసిపి అధినేత జ‌గ‌న్‌కు క‌డ‌ప జిల్లా పులివెందుల ప‌దిలంగా వున్నాయి. మరో ఇద్దరు కీలకనేతలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు తనయుడు లోకేష్ ఎక్కడ నుండి పోటీ చేయాలి అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. వీరి పోటీపై తీవ్ర కసరత్తులు జరుగుతున్నాయి.

పవన్ తూర్పు గోదావరి నుండి ఎక్కడో చోట లేదా విశాఖ నుండి పోటీచేసే అవకాశాలను ప‌రిశీలిస్తున్నారు. టీడీపీ నుండి లోకేష్ మంత్రి గంటా సిట్టింగ్ స్థానం భీమిలి లేదా విశాఖ తూర్పు నుండి పోటీ చేయాలనే దానిపై తీవ్రంగా క‌స‌ర‌త్తులు జరుగుతున్నాయి. అయితే మంత్రి నారా లోకేష్ విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దిగుతున్నారని తాజాగా టీడీపీ స్పష్టం చేసింది.