పాత వాసనలతో అర్జున

Arjuna Movie
Arjuna Movie

ఈ మధ్య రాజశేఖర్ గరుడవేగ తో ఫామ్ లోకి వచ్చాడు.ఆ తరువాత కల్కి అనే సినిమా స్టార్ట్ చేసాడు.అయితే ఎప్పుడో గతంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన అర్జున సినిమా ఇప్పడు రిలీజ్ కాబోతుంది.ఆ సినిమా ఇప్పటిది కాదు.అయినా కూడా ఎన్నికల సీజన్ కావడంతో హడావిడిగా ఆ సినిమాని దుమ్ముదులిపి రిలీజ్ చేస్తున్నారు.ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు.

కానీ తమిళ డైరెక్టర్ కన్మణి రూపొందించాడు.దాన్ని ఇప్పుడు సి.కళ్యాణ్ రిలీజ్ చేస్తున్నాడు.ఆ సినిమా టీజర్ అంటూ ఒక ౩౦ సెకన్ల వీడియో రిలీజ్ చేసారు.అది కూడా చాలా సబ్ స్టాండర్డ్ లో ఉంది.ఎప్పటోనుండి విని విని ఉన్న అరిగిపోయిన డైలాగ్స్ నే మళ్ళీ ఆ టీజర్ లో వినిపించారు.ఈ నెల 15 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయం ఫలితం సాధిస్తుందో చూడాలి.