పవన్ కల్యాణ్ సీఎం కావాలని ప్రత్యేక పూజలు..

PAWANKALYAN, AP, JANASENA, KANAKADURGAMMA, VIJAYAWADA, ELECTION, ANDHARAPRADESH,
PAWANKALYAN, AP, JANASENA, KANAKADURGAMMA, VIJAYAWADA, ELECTION, ANDHARAPRADESH,

జనసేనాని పవన్ కల్యాణ్ తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం యూరప్ లో పర్యటిస్తున్న సంగతి తెలుసుకదా. తాజాగా పవన్ కల్యాణ్ AP ముఖ్యమంత్రి కావాలంటూ జనసేన శ్రేణులు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడకు చెందిన , కార్యకర్తలు,నేతలు ఈ రోజు తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు పూజలు జరిపారు.

ఈ సందర్భంగా జనసేన నేతలు మీడియాతో మాట్లాడుతూ .. పవన్ కళ్యాణ్ కు ఏపీలో రోజురోజుకూ ఆదరాభిమానాలు పెరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే మరింత మంది నేతలు జనసేనలో చేరుతారని కూడా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పవన్ నే AP ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.