నాగచైతన్య-సమంతల ‘మజిలీ’ ఫస్ట్ లుక్ విడుదల…!

‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో రియల్ లైఫ్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఈ చిత్రానికి ‘దేర్‌ ఈజ్‌ లవ్‌.. దేర్‌ ఈజ్‌ పెయిన్‌’ అనే క్యాప్షన్‌ కూడా పెట్టారు. ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ను ఆదివారంనాడు విడుదల చేశారు.నాగచైతన్య, సమంత లుక్‌ ఇందులో చాలా కొత్తగా ఉంది. వైజాగ్‌ నేపథ్యంలో ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతోంది. దివ్యాంశ కౌశిక్‌ రెండో హీరోయిన్‌గా నటిస్తోంది.

రావు రమేష్‌, పోసాని కష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపిసుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ రెద్ది షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.