నవీన్ చంద్ర 28 డిగ్రీస్‌ సీ…!

28c
28c

డా.అనీల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో నవీన్‌ చంద్ర, షాలిని హీరో హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం ’28 డిగ్రీస్‌ సీ’. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాను అభిషేక్‌ సాయి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్‌ సాయి మాట్లాడుతూ ‘టైటిల్‌ అందరిలో క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. నవీన్‌చంద్రకి ఈ సినిమాతో మంచి హిట్‌ వస్తుందనే నమ్మకం ఉంది.

డా.అనీల్‌ విశ్వనాథ్‌ సరికొత్త కథ, కథనాలతో అద్భుతంగా తెరకెక్కించారు.శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు గ్యారీ బిహెచ్‌ ఎడిటింగ్‌ వర్క్‌ అందిస్తున్నారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కిట్టు విస్సాప్రగడ కథకు తగ్గ మాటలు, మ్యూజిక్‌కి అనుగుణంగా పాటలను అందించారు. సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని అన్నారు.