నట్టేట మునుగుతున్న లక్ష్మీస్ NTR బయ్యర్స్

Lakshmis NTR
Lakshmis NTR

లక్ష్మీస్ ఎన్టీఆర్…కేవలం వివాదాలే ఆయుపట్టుగా RGV తెరకెక్కించిన సినిమా.ఈ సినిమాపై ముందు నుండి ఉన్న వివాదాన్ని రిలీజ్ టైం కి ఇంకా పెంచి చూపించి దాన్ని క్యాష్ చేసుకోవాలి అనుకున్నాడు RGV.దానికి అనుకున్న హైప్ తెచ్చి భారీ రేట్లకు సినిమాను అమ్మాడు.కానీ అనూహ్యంగా సినిమా ముందు రోజు రిలీజ్ పై ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది.దీంతో డైలమాలో పడిన వర్మ మిగిలిన చోట్ల సినిమా రిలీజ్ చేసాడు.సినిమా సూపర్ గా లేకపోయినా కూడా ఒక మోస్తరుగా టాక్ తెచ్చుకుంది.పొలిటికల్ ఫ్లేవర్ టచ్ చెయ్యడం,ఎలెక్షన్ మూమెంట్ కూడా కావడంతో ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి.అయితే ఇంకా ఈ సినిమా రిలీజ్ కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పటికే పైరసీ లింక్స్ భారీగా సర్యులేట్ అయ్యాయి.

దీంతో అనేకమంది మొబైల్ ఫోన్స్ లో కూడా ఈ సినిమా చక్కెర్లు కొడుతుంది.అసలు ఎలెక్షన్స్ తరువాత ఈ సినిమా రిలీజ్ అయితేనే ఎవ్వరూ చూడరు అని భయపడుతున్న బయ్యర్స్ కి ఈ పరిణామంతో దిగులు పట్టుకుంది.అసలే RGV డబ్బు విషయంలో చాలా గట్టిగా ఉంటాడు.ఆఫీసర్ సినిమా కొనుకున్న డిస్ట్రిబ్యూటర్ విషయంలో ఏం జరిగిందో అందరికి తెలిసిందే.మళ్ళీ ఇప్పడు లక్ష్మిస్ ఎన్టీఆర్ కొనుక్కున్నవాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉండేలా ఉంది.మొత్తానికి RGV వెర్సస్ పొలిటికల్ పార్టీ అనే గేమ్ అనవసరంగా అవస్థలుపడుతున్నారు సినిమా కొనుక్కున్నవాళ్ళు.జనాలకు సినిమా చూపించాలి అనుకున్న వాళ్ళకే సినిమా కనబడుతుంది.