త్వరలో మదర్ థెరీసా బయోపిక్…!

Mother Teresa
Mother Teresa

భారత రత్న మదర్ థెరీసా జీవితం ఆధారంగా ఒక బయోపిక్ చిత్రం రూపొందనుంది.దీని ఫై ఇటివలే అధికారిక ప్రకటన వెలువడింది. సీమా ఉపాధ్యాయ్ తను రాసిన ‘మదర్ థెరీసా : ది సెయింట్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నిర్మాతలు ప్రదీప్ శర్మ, నితిన్ మన్మోహన్, గిరీష్ జోహర్, ప్రాచీ మన్మోహన్ సంయుక్తంగా ‘మదర్ థెరీసా : ది సెయింట్’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

కాగా ఈ సినిమాలో మదర్ థెరీసా పాత్రలో ఎవరు నటించేదీ ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు ఉండనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతల ఇటీవలే ఈ బయోపిక్ కోసం సిస్టర్ ప్రేమ మేరీ పైరిక్, సిస్టర్ లిన్నేలను కలుసుకుని వారి ఆశీర్వాదం తీసుకున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరులలో సెట్స్ మీదకు వెళ్లనుంది.