తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్

Inclusion of Name in Electoral Roll for First time Voter
Inclusion of Name in Electoral Roll for First time Voter
రెండు తెలుగు  రాష్ట్రాల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ ప్రారంభ‌మ‌యింది.  కేవ‌లం 30 రోజుల స‌మ‌యం మాత్ర‌మే వుంది.  తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ తొలి దశలోనే పూర్తవుతుందని కేంద్ర‌ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇటు  ఫ‌స్ట్ ఫేజ్ లోనే  తెలంగాణలో కూడా లోక్ సభ ఎన్నికలు పూర్తవుతాయి. 

మార్చి 18న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 26న నామినేషన్లు పరిశీలిస్తారు.మార్చి 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం వుంది. ఫలితాలు మాత్రం దేశవ్యాప్తంగా అన్ని దశల పోలింగ్ పూర్తయిన తర్వాత మే 23న విడుదల చేస్తారు.

ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో తలమునకలుగా ఉన్న ప్రధాన పార్టీలు త‌మ పార్టీల నుంచి ముహూర్తం చూసుకుని ఫ‌స్ట్ లిస్ట్ ను ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి. దీనికిదోడు టైమ్ లేక‌పోవ‌డంతో పార్టీల మేనిఫెస్టోల‌ను సైతం ప్ర‌క‌టించి ప్ర‌చార ప‌ర్వం ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాయి.