తెలుగుదేశం గూటికి వంగ‌వీటి

VANGAVEETI RADHA
VANGAVEETI RADHA

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వైసిపి అధ్యక్షుడు జగన్‌కు మళ్లీ ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించబోతున్నారని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయ‌న సైకిలెక్కారు. వంగ‌వీటి రాధాకు సీఎం కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు.

అనంత‌రం వంగ‌వీటి మాట్లాడుతూ.. జగన్ ఎప్పుడూ వెన్నుపోటు గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటాడని.. కానీ తనను తమ్ముడూ అంటూనే వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు.

ప్రజలు తప్పకుండా నీకు మళ్లీ ప్రతిపక్ష నేత హోదా అందిస్తారంటూ రాధా సెటైర్ వేశారు. రాధా చేరిక సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, టిడిపి కార్యకర్తలు సిఎం చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు.