తెలుగుదేశంకు గుడ్ బై చెప్పిన మాగుంట

magunta srinivas reddy
magunta srinivas reddy

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌ధ్యంలో వ‌ల‌స‌ల ప‌ర్వం ఊపందుకొంది. టిక్కెట్ల వేట‌లో అల‌సిన నాయ‌కులు గోడ‌దూకుతున్నారు. దీంతో ఏపిలోని రెండు ప్ర‌ధాన పార్టీల‌లో జంపింగ్ లు కామ‌న్‌గా మారాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. మాజీమంత్రి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవితో పాటు, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు పంపించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి త్వరలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. తమ కుటుంబ సభ్యులు, మాగుంట అభిమానులు, శ్రేయోభిలాషుల నిర్ణయం మేరకే తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.