తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితా విడుద‌ల

Telangana Congress Party
Telangana Congress Party

లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలో పోటీ చేసే 8 మంది అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ హైక‌మాండ్ ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల‌లో మొద‌టి విడతలో 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. వీరిలో ఐదుగురు ఇటీవల జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారే వున్నారు. .

టి ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తాజా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి తిరిగి చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసే ఛాన్స్ కొట్టేవారు. రమేష్‌ రాథోడ్ ను ఆదిలాబాద్‌ లోక్‌సభ నుంచి, బలరాం నాయక్‌ను మహబూబాబాద్‌, ఎ.చంద్రశేఖర్‌ను పెద్దపల్లి, పొన్నం ప్రభాకర్‌ను కరీంనగర్‌, రేవంత్‌రెడ్డిని మల్కాజ్‌గిరి, మదన్‌ మోహన్‌ను జహీరాబాద్‌, గాలి అనిల్‌కుమార్‌ను మెదక్‌ లోక్‌సభ నుంచి పోటీకి పెట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

రమేష్‌ రాథోడ్‌, బలరాం నాయక్‌, పొన్నం ప్రభాకర్‌, విశ్వేశ్వరరెడ్డిలు గతంలో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన వారే.ఈ నేప‌ధ్యంలో తాను ఇవాళ్టి నుంచే ప్రచారం ప్రారంభించానన్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి . హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ వెంకటశ్వరస్వామి ఆలయంలో ఆయ‌న ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్లమెంట్ ఆట మోడీ, రాహుల్ మధ్యే ఉంటుందన్నారు రేవంత్ . పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ నామమాత్రమేనన్నారు ఆయ‌న .