తెలంగాణ కాంగ్రెస్ కు మ‌రో షాక్

banothu haripriya
banothu haripriya

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్‌ల మీద షాక్ లు త‌గులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ షాకిచ్చారు. ఇల్లెందు అభివృద్దికి సీఎం బాటలో పయనించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

అనంత‌రం హరిప్రియా నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ కు రాజీనామా చేసి టి ఆర్ ఎస్ బీ ఫామ్ పై పోటీకి సిద్దంగా ఉన్నట్లు వెల్ల‌డించారు. . గిరిజన ప్రాంతాల అభివృద్దికి కేసీఆర్ చేస్తున్న కృషి త‌న‌ని ఆక‌ట్టుకుంద‌న్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తాను భాగస్వామ్యమవుతానని వెల్ల‌డించారు ఆమె.