తెలంగాణ‌లో చేజారుతోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Vanama Venkateswar Rao
Vanama Venkateswar Rao

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ కు వ‌రుస‌గా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఝ‌ల‌క్ ఇస్తున్నారు. దీంతో తెలంగాణ‌లో కాంగ్రెస్ గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తోంది. తాజాగా ఖమ్మం జిల్లా నుంచి మరో నేత హస్తం పార్టీని వీడి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు.

హైదరాబాద్ లోని ప్రగతిభవన్ కు తన కుమారులతో కలిసి వ‌న‌మా చేరుకున్నారు. ఖ‌మ్మం . జిల్లాలో రాజకీయాలు, పార్టీ పరిస్థితిపై కేటీఆర్ తో చర్చించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లోకి చేరేందుకు వనమా ఆసక్తి చూపగా కేటీఆర్ స్వాగతించినట్లు తెలిసింది. ఇటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా కారెక్కేందుకు సిద్ద‌మైన‌ట్టు స‌మాచారం.

తాజా పరిణామాలతో తెలంగాణ అసెంబ్లీలో 12 గా ఉన్న కాంగ్రెస్ బలం ఇప్పుడు 11కు పడి పోనుంది దీంతో కాంగ్రెస్ పార్టీ విపక్ష హోదాను కోల్పోనుంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు ఇకపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో సాటు, కోడెం వీరయ్య మాత్రమే మిగలనున్నారు.